విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్ ఏంటి?

విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్ ఏంటి?
x
Highlights

ఈవీఎమ్స్‌లో లోపాలు , వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత...

ఈవీఎమ్స్‌లో లోపాలు , వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిపై వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించిన విపక్షాలు తాము లేవనెత్తిన సమస్యలకు ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే, సమస్య మరింత పెద్దది అవుతుందని హెచ్చరించారు.

ఢిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన విపక్షాలు ప్రధానంగా ఎన్నికల కమిషన్ వైఖరిపై చర్చించారు. సీఈసీ పక్షపాత ధోరణిపై వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ లీడర్స్‌ అహ్మద్‌పటేల్‌, అశోక్‌ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్‌‌ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా... డీఎంకే నాయకురాలు కనిమొళి తృణమూల్ నుంచి ఒబ్రెయిన్‌ సహా మొత్తం 19 పార్టీల నేతలు హజరయ్యారు. అయితే, ఈ మీటింగ్‌కు డుమ్మాకొట్టి సడన్‌ షాకిచ్చారు కర్నాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి.

సమావేశం తర్వాత సీఈసీని కలిసిన ఎన్డీయేతర పార్టీల నేతలు 8 పేజీల మెమొరాండాన్ని అందజేశారు. ముఖ్యంగా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు. అలాగే వీవీప్యాట్ల లెక్కింపుపై సరైన మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వలేదంటూ ఈసీని నిలదీశారు. తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని, ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే, సమస్య మరింత పెద్దది అవుతుందని హెచ్చరించారు.

ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, విపక్షాలు లేవనెత్తిన ఏ అంశాన్ని కూడా పట్టించుకోలేదంటూ నిలదీసిన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషనర్ ముందు నిరసన వ్యక్తంచేశారు. అయితే ఎన్డీ‍యేతర పార్టీలు లేవనెత్తిన అంశాలపై రేపు చర్చించనున్నట్లు ఈసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసీ అఫీషియల్ రియాక్షన్ తర్వాతే విపక్షాలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories