ఏపీలో నేటి నుంచి వాహనాలకు ఒకే సిరీస్‌

ఏపీలో నేటి నుంచి వాహనాలకు ఒకే సిరీస్‌
x
Highlights

'ఒక రాష్ట్రం - ఒక సీరీస్' పేరిట ఏపీ రవాణా శాఖ వినూత్న విధానాన్ని ప్రారంభించింది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసే కొత్త వాహనాలకు AP 39 సిరీస్‌తో వాహనాల...

'ఒక రాష్ట్రం - ఒక సీరీస్' పేరిట ఏపీ రవాణా శాఖ వినూత్న విధానాన్ని ప్రారంభించింది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ చేసే కొత్త వాహనాలకు AP 39 సిరీస్‌తో వాహనాల నెంబర్లు కేటాయించనున్నారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇవాల్టి నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. విజయవాడలో ఈ నూతన విధానాన్ని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ వాహనాలకు జిల్లాకో కోడ్‌ చొప్పున కేటాయించేవారు. ఇకపై ప్రతి జిల్లాలో ప్రతి కొత్త వాహనానికి AP 39 సిరీస్‌తో నెంబర్లు కేటాయించనున్నారు. ఆర్టీసీ వాహనాలకు AP 39Z, పోలీస్‌ వాహనాలకు AP 39P, రవాణా వాహనాలకు AP 39T, సహా U,V, W, X, Y సిరీస్‌ కేటాయించారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో 'ఒకే రాష్ట్రం - ఒకే సిరీస్' విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories