logo

ఒక్క ఓటుతో అభ్యర్థుల భవితవ్యం తారుమారు

ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాత మార్చేసింది. ఒక్క ఓటు కొందరిని సర్పంచ్ పీఠం ఎక్కించగా అదే ఓటు మరికొందరిని పరాజయంపాలు చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసిన ఒక్క ఓటు.

ఒక్క ఓటుతో అభ్యర్థుల భవితవ్యం తారుమారు

ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాత మార్చేసింది. ఒక్క ఓటు కొందరిని సర్పంచ్ పీఠం ఎక్కించగా అదే ఓటు మరికొందరిని పరాజయంపాలు చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసిన ఒక్క ఓటు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు క్షణం క్షణం ఉత్కంఠ రేపాయి. ఒక్క ఓటుతో అభ్యర్థుల భవితవ్యం తారుమారైంది. కుమ్రంభీం జిల్లా చింతమానేపల్లి మండలం కోయపల్లి సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 234 ఓట్లు పోలయ్యాయి. ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ప్రీతికి 116 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్ధి సుహాసినికి 115 ఓట్లు పోలయ్యాయి. మిగతా మూడు ఓట్లు రద్దు కావడంతో 116 ఓట్లు వచ్చిన ప్రీతి సర్పంచ్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చేర గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. కంది మమతకు 224ఓట్లు రాగా అల్లూరి వెంకటమ్మకు 223 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు ఆధిక్యతతో మమత విజయం సాధించారు. దీనిపై వెంకటమ్మ అభ్యంతరం తెలపడంతో రీకౌంటింగ్ జరిపారు. రీ కౌంటింగ్‌లో అదే ఫలితం వచ్చింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వెంకటమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మంచిర్యాల జిల్లా కాశిపేట మండలం తాటిగూడలో ముత్యాల స్వప్ప ఒక్క ఓటుతో విజయం సాధించింది. కేవలం ఒక్క ఓటు తమ పుట్టి ముంచిందని ఓడిపోయిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


లైవ్ టీవి

Share it
Top