చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్..మరి వర్కవుట్ అయ్యేనా ?

చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్..మరి వర్కవుట్ అయ్యేనా ?
x
Highlights

ఏపీలో పోలింగ్‌ ముహూర్తం చేరువయ్యేకొద్దీ ప్రధాన పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో...

ఏపీలో పోలింగ్‌ ముహూర్తం చేరువయ్యేకొద్దీ ప్రధాన పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచబోతోంది. ఎన్నికలకు పట్టుమని వారంరోజులు మాత్రమే ఉంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న జాతీయ నేతలు టీడీపీ పార్టీ తరుఫున ప్రచార బరిలో దించింది టీడీపీ అధిష్టానం. కాగా ఇప్పుడు సరికొత్త ప్యూహ్వాంతో ఏకంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్లను దించబోతోంది.

ఇప్పటికే టీడీపీ తరుఫున నారా రోహిత్ నందమూరి తారకరత్నలు రంగంలోకి దిగి ప్రచారంలో జోరుగా దూసుకెళ్లున్నారు. మరో పక్కా ఒకప్పటి హీరోయిన్ దివ్యవాణి కూడా స్పీడ్ పెంచారు. వారం రోజులు కూడా లేకపోవడంతో ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలని నారా చంద్రబాబు టీడీపీ తరుఫున మరో స్టార్ క్యాంపెయినర్ ను ప్రచారంలోకి దించారు. ఏప్రిల్ 4 5 తేదీల్లో అంటే (నేడు, రేపు) రేవతి ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర హస్తకళల చైర్మన్ పాలిప్రసాద్ తెలిపారు. కాగా ఇప్పటికే టాలీవుడ్ లోని ప్రముఖులు కొంత మంది వైసీపీలో చేరి ప్రచారం చేస్తున్నారు. ఇక దీంతో బాబు కూడా స్టార్‌ల కోసం వెతికి టాలీవుడ్ వాళ్లు దొరక్కపోవడంతో రేవతిని ఒప్పించినట్టు సమాచారం. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం బరిలో దించి భారీ విజయం సాధించిన చంద్రబాబు మరీ ఈసారి ఏకంగా జాతీయ పార్టీ నేతలు, సీని రంగం వారిని ఎన్నికల ప్రచార బరిలో దింతున్న బాబుకు మరీ ఈసారి కూడా వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories