కానిస్టేబుల్‌ను కర్రతో చితకబాదిన వృద్ధుడు

కానిస్టేబుల్‌ను కర్రతో చితకబాదిన వృద్ధుడు
x
Highlights

చిత్తూరు జిల్లా పెనమలూరులో పోలీసులపై ఓ వృద్ధుడు దాడికి దిగాడు. గ్రామంలోని స్ధలం వివాదంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ను...

చిత్తూరు జిల్లా పెనమలూరులో పోలీసులపై ఓ వృద్ధుడు దాడికి దిగాడు. గ్రామంలోని స్ధలం వివాదంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ను వృద్ధుడు అడ్డుకున్నాడు. వివాదంలో ఉన్న స్ధలాన్ని చదును చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా కానిస్టేబుల్‌పై కర్రతో దాడికి దిగాడు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ కానిస్టేబుల్‌ను కర్రతో చితకబాదాడు. ఈ ఘటనలో తలతో పాటు చేతికి స్వల్ప గాయమైంది. దాడికి పాల్పడిన వృద్ధుడి కుమారుడు టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు తెలియజేశారు.

శాంతి భద్రతలు కల్పించే పోలీసులపైనే దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. వృద్ధుడు కావడంతోనే తాము ఏమి చేయలేకపోయామని బాధిత కానిస్టేబుల్ చెబుతున్నాడు. అయితే వృద్ధుడి కుమారుడు టీడీపీ కార్యాలయంలో పనిచేయడం వల్లే పోలీసులు ఏమి చేయలేకపోయారని స్ధానికులు అంటున్నారు. సామాన్యుడి గట్టిగా మాట్లాడితేనే సహించలేని పోలీసులు ఈ స్దాయిలో దాడి జరిగినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories