నిజామాబాద్‌ జిల్లాలో వీడీసీల ఆగడాలు

నిజామాబాద్‌ జిల్లాలో వీడీసీల ఆగడాలు
x
Highlights

నిజామాబాద్‌ జిల్లాలో వీడీసీల దుశ్చర్య మరొకటి వెలుగులోకొచ్చింది. నందిపేట్‌ మండలం మారంపల్లిలో దళిత కుటుంబాలను బహిష్కరించిన ఘటన మరవకముందే మరో ఘటన...

నిజామాబాద్‌ జిల్లాలో వీడీసీల దుశ్చర్య మరొకటి వెలుగులోకొచ్చింది. నందిపేట్‌ మండలం మారంపల్లిలో దళిత కుటుంబాలను బహిష్కరించిన ఘటన మరవకముందే మరో ఘటన బయటపడింది. విడిసి మాట వినలేదని... మూడు కులాలను గ్రామ బహిష్కరణ విధించింది బాల్కొండ గ్రామాభివృద్ధి కమిటీ. గ్రామంలో వీరితో ఎవరూ మాట్లాడొద్దనీ, వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను, కిరాణా దుకాణాల్లో నిత్యావసరాలు ఇవ్వొద్దనీ హుకూం జారీ చేసింది.

ఆర్టీఏ అప్లికేషన్‌లను పెట్టారంటూ పద్మశాలి, గౌడ, ముస్లింలను విడీసీ బహిష్కరణ విధించింది. అంతేకాక బహిష్కరణకు గురైన వాళ్లు అద్దె ఇళ్లలో ఉంటే ఇళ్లను ఖాళీ చేయించాలని వార్నింగ్‌ ఇచ్చారు. కనీసం కూరగాయలు, నీళ్లు, పాలు కూడా పోయట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజాలో తమకు కనీసం ఇఫ్తార్‌ టైంలో ఇళ్లు కూడా ఇవ్వడం లేదని ముస్లింలు ఆవేదన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే వీడీసీలు మాత్రం ఎవరిని బహిష్కరించలేదని చెబుతున్నారు.తమపై కావాలనే ఆరోపణ చేస్తున్నారని వాపోయారు. బాల్కొండ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories