వెండితెరపై సంక్రాంతి సందడి

వెండితెరపై సంక్రాంతి సందడి
x
Highlights

అందాల రాముడు, వెండితెర కృష్ణుడు, తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్న సుందరాంగుడు ఎన్టీఆర్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన తొలి చిత్రం కథానాయకుడు సిల్వర్‌స్క్రీన్‌పై అబ్బుపరుస్తోంది.

అందాల రాముడు, వెండితెర కృష్ణుడు, తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్న సుందరాంగుడు ఎన్టీఆర్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన తొలి చిత్రం కథానాయకుడు సిల్వర్‌స్క్రీన్‌పై అబ్బుపరుస్తోంది. తెలుగోడి నిలువెత్తు నిదర్శనం ఆయన అహార్యం. అంతటి సమ్మోహన రూపాన్ని మరోసారి తెరపై చూస్తూ తెలుగువారంతా మైమర్చిపోతున్నారు. సంక్రాంతి పండుగను మూడు రోజుల ముందే జరుపుకుంటున్నారు.

తెలుగు తెరపై అప్పుడే సంక్రాంతి పండుగొచ్చింది. ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు తెలుగువారి ముంగిట్లోకి వచ్చింది. ఎన్టీఆర్‌ను తెరపై చూసిన చాలాకాలం తర్వాత మరోసారి ఆయన్ని చూసే భాగ్యం కలగడంతో తెలుగువారంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. బండెనక బండి కట్టి ఎన్టీవోడి సినిమాకు వెళ్లి రాజమండ్రిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కథానాయకుడు సినిమా కోసం తెలుగువారంతా థియేటర్లకు సంప్రదాయపద్దతిలో వెళ్లారు. ఎమ్మెల్యే గోరంట్ల కూడా కథానాయకుడు సినిమాను చూశారు. పంచె, కండువా కప్పుకుని వెండితెర అద్భుత కావ్యాన్ని ఆస్వాదించారు.

కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఎక్కడైనా ఏ థియేటర్లలో అయినా అంతా ఎన్టీఆర్‌ మయం. ఆనాటి కాలంలో ఎన్టీఆర్‌ను చూడలేని వారికి ఈ మూవీ అవకాశం అంటున్నారు. తండ్రి పాత్రలో కుమారుడు బాలయ్య జీవించారంటూ పండుగ చేసుకుంటున్నారు. కేక్‌లు కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. పాలాభిషేకాలు, బాణాసంచా కాల్పులతో థియేటర్లు దద్దరిల్లాయి. ఎన్టీఆర్ పాటలపై స్టెప్పులేస్తూ పండుగ జరుపుకున్నారు. థియేటర్లలో బాలయ్య కనబడ్డ ప్రతీసారి అరుపులు కేకలతో ఎంజాయ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ అంటూ ఈయనలో ఆయన్ని చూసుకుంటున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాల్లో కూడా కథానాయకుడికి బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. కేక్ కట్ చేసి, కొబ్బరికాయలు కొట్టి జై బాలయ్య, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories