నిరుపేదలకు అండగా.. ఎన్టీఆర్‌ భరోసా పథకం

నిరుపేదలకు అండగా.. ఎన్టీఆర్‌ భరోసా పథకం
x
Highlights

వయస్సు ఉన్నంత వరకు కష్టపడి జీవితపు చివరిదశకు చేరుకున్న వారికి కనీస భరోసా కావాలి. ఆఖరు మజిలీ చేరుకునే వరకు అండగా నిలబడాలి. అలాంటి వారికి నేనున్నానంటూ...

వయస్సు ఉన్నంత వరకు కష్టపడి జీవితపు చివరిదశకు చేరుకున్న వారికి కనీస భరోసా కావాలి. ఆఖరు మజిలీ చేరుకునే వరకు అండగా నిలబడాలి. అలాంటి వారికి నేనున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ పేదకుటుంబానికి పెద్దకుమారుడిలా ఉంటానని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడమే కాదు కనీస అవసరాలకు 2 వేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని 3 వేలకు పెంచుతామని తీపి కబురు అందించారు.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే నిరుపేదలు, అండగా ఉండేవారి కోసం వెతికే వెన్ను వంగిపోయిన వృద్ధులు. ఇలా వయస్సుడికి పోయిన ముసలివారికి.. పెద్ద కుమారుడిలా ఉంటానని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అప్పట్లో వృద్దాప్య పింఛన్లు 200 రూపాయలుండగా.. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు పింఛన్లను ఒకేసారి 5 రెట్లు పెంచి.. వెయ్యి రూపాయలు చేశారు. అక్కడితో ఆగకుండా మొన్నటి సంక్రాంతి పండక్కి పింఛన్లు అందుకుంటున్న వారి కళ్లల్లో నిజమైన ఆనందాన్ని నింపుతూ వెయ్యి రూపాయలున్న పెన్షన్‌ను 2 వేలకు పెంచుతూ ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నారు. అది కూడా జనవరి నుంచి అమలు చేస్తామన్న హామీతో ఫిబ్రవరిలో ఒక్కో పెన్షన్‌ దారు ఏకంగా 3 వేలు అందుకుని నిజమైన సంక్రాంతిని జరుపుకున్నారు.

ఎక్కడి 2 వందల రూపాయలు ఎక్కడి 2 వేల రూపాయలు. ఐదేళ్ల కాలంలోనే ఏకంగా పది రెట్లు పెంచిన ఘనత.. కేవలం చంద్రబాబుదే. ఎన్టీఆర్‌ భరోసా పేరుతో 54 లక్షల 14 వేల 592 మందికి నెల నెలా క్రమం తప్పకుండా ఏపీ ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది. ఇందులో 24 లక్షల 22 వేల 444 మంది వృద్ధులు, 20 లక్షల 13 వేల 808 మంది వితంతువులు, 6 లక్షల 41 వేల 820 మంది దివ్యాంగులు, లక్షా 7 వేల 998 మంది చేనేత కార్మికులు, 28 వేల 11 మంది కల్లుగీత కార్మికులు, 45 వేల 358 మంది మత్య్సకారులు, లక్షా 12 వేల 471 మంది ఒంటరి మహిళలు, 42 వేల మంది ఇతరులు ఎన్టీఆర్‌ భరోసా పథకం ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు.

ట్రాన్స్‌జెండర్స్‌, చర్మకార వృత్తిదారులు, దివ్యాంగులకు నెలకు 3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 3 వేల 500, రెండు చేతులు, రెండు కాళ్లు లేని వారికి 10 వేల రూపాయల చొప్పును పింఛను అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 24 వేల 618 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం నుంచి వచ్చిన సహకారం మాత్రం కేవలం 11 వందల కోట్లు మాత్రమే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే ఈ పింఛన్లను రాబోయే రోజుల్లో 3 వేలకు పెంచుతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు అందించడంతో దేశంలోనే అత్యధిక పింఛన్లు అందుకుంటున్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఎంత కష్టమైనా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాల్లో ఆనందం నింపడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories