Top
logo

ఇక ఆన్ లైన్ లో గద్వాల పట్టుచీరలు

Amazon
X
Amazon
Highlights

ఇప్పుడంతా ఆన్ లైన్ మయం ఇంట్లో కూర్చోనే కావాల్సినవి కొనుగోలు చేసుకుంటున్నారు. గుండుసూది నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఆన్ లైన్ లోనే కొనుగోలు జరుగుతున్నాయి. వీటి జాబితాలో గద్వాల పట్టు చీరలు కూడా చేరిపోయాయి.

ఇప్పుడంతా ఆన్ లైన్ మయం ఇంట్లో కూర్చోనే కావాల్సినవి కొనుగోలు చేసుకుంటున్నారు. గుండుసూది నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఆన్ లైన్ లోనే కొనుగోలు జరుగుతున్నాయి. వీటి జాబితాలో గద్వాల పట్టు చీరలు కూడా చేరిపోయాయి. అమెజాన్ సంస్థ గద్వాల పట్టు చీరలను ఆన్ లైన్ అమ్మకాలు చేపట్టింది. ఇక నుంచి మహిళలు తమకిష్టమైన చీరలను ఇంటి నుంచే కొనుగోలు చేయవచ్చు.

గద్వాల జరీ పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. పెళ్లిళ్లు, పేరంటాలకే కాకుండా చిన్న చిన్నకార్యక్రమాలకు సైతం గద్వాల జరీ పట్టు చీరలకు ఎంతో విలువనిస్తారు. ఇప్పటికే పలు పట్టణాలు, ప్రధాన షాపుల్లో ఈ పట్టు చీరలు అందుబాటులో ఉన్నాయి. అయితే అసలైన గద్వాల పట్టుచీరలను గుర్తు పట్టలేకపోతున్నారు. మాల్స్ లో అందుబాటులో ఉన్న వాటిని గద్వాల పట్టు చీరలని చెప్పి అమ్ముతున్నారు. కొని మహిళలు మోసపోతున్నారు. ఇక నుంచి అలా జరగకుండా గద్వాల పట్టు చీరలు మరింత చేరవ కానున్నాయి. బాల చేనేత ఉత్పత్తిదారులతో అమెజాన్ సంస్థ సమావేశం నిర్వహించి చీరలను ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇక నుండి దేశ విదేశాల్లో ఉండే మహిళలు సైతం ఎక్కడి నుండైనా పట్టుచీరలు పొందడానికి అమెజాన్ వీలు కల్పించింది. గద్వాల పట్టు చీరలను వారికి కావాల్సిన ధరల్లో , ఇష్టమైన రంగులు, వివిధరకాల పట్టుచీరలను ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఇంటి వద్దే పొందే అవకాశం కల్పించింది అమెజాన్.

ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మహిళలకు వారికి కావాల్సిన చీరలను సరసమైన ధరలకు దొరికే విధంగా చర్యలు చేపట్టారు. గద్వాల చీరలు ఆన్ లైన్ అమ్మకాలపై చేనేత కార్మికులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికులకే కాకుండా మహిళలు మోస పోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది అమెజాన్ కంపెనీ. ఆన్ లైన్ అమ్మకాలు గద్వాల చీరలకు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతుందని చేనేత కార్మికులు భావిస్తున్నారు.


Next Story