కేంద్రంపై ఎన్డీయేతరపక్షాల దండయాత్ర...మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్

కేంద్రంపై ఎన్డీయేతరపక్షాల దండయాత్ర...మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్
x
Highlights

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎన్డీయేతర పక్షాల దండయాత్ర ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ లో సీబీఐ ప్రవేశంతో ప్రతిపక్షాల ఉద్యమానికి మరింత ఊతం ఇచ్చింది....

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎన్డీయేతర పక్షాల దండయాత్ర ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ లో సీబీఐ ప్రవేశంతో ప్రతిపక్షాల ఉద్యమానికి మరింత ఊతం ఇచ్చింది. కేంద్రం తీరుకు నిరసనగా కొల్ కతాలో సీఎం మమతాబెనర్జీ ఆందోళన చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. దీదీ దీక్షకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర నేతలు మద్దతు తెలిపారు.

తన మాట వినని రాష్ట్రాలు, ఎన్డీయేతర పక్షాల నేతలపై సీబీఐని మోడీ ప్రభుత్వం పురికొల్పుతోంది. ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు చేపడుతోంది. మూడు రోజుల క్రితం ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయవతిపై కేసులు పెట్టింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. అయితే, కేంద్రంపై దీదీ తిరుగుబాటు జెండా ఎగురేశారు. రాజ్యాంగ పరిరక్షణ పేరిట నిరసన దీక్ష చేపట్టారు.

కొద్ది నెలల క్రితం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక ఆ పార్టీ ఎంపీలు, నేతల ఇళ్లపై సీబీఐ, ఈడీ సోదాలు చేసింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, ఇతర టీడీపీ నేతలపై కేసులు పెట్టింది. చివరకు తనను కూడా అరెస్ట్ చేస్తారేమోనని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు ఏపీలో సీబీఐ ప్రవేశాన్ని నిషేదించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లభించిన తర్వాతే సీబీఐ రాష్ట్రంలో విచారణ చేపట్టాలనే నిబంధన విధించారు.

పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ చర్య దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్ర దుశ్చర్యను ఖండిస్తున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతా ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లి బీజేపీయేతర పక్షాలతో సమావేశమై, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories