కొనసాగుతున్న ఎమెల్యేల ప్రమాణస్వీకారాలు ..

కొనసాగుతున్న ఎమెల్యేల ప్రమాణస్వీకారాలు ..
x
Highlights

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో ‌ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జగన్ తర్వాత...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో ‌ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం జగన్ తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. ప్రతిపక్షనేత తర్వాత ఉప ముఖ్యమంత్రులు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య , విద్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష‌్పశ్రీవాణి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ ,వాణిజ్య,పన్నులశాఖ మంత్రి నారాయణ స్వామి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

తర్వాత జలవనరులు, సాగునీటి శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ , పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కార్మిక , ఉపాధి, శిక్షణ , ఫ్యాక్టరీ శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, వ్యవసాయం, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రోడ్లు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ , ఆర్థిక , ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి,గనులు, భూగర్బ శాఖ మంత్రి పెద్దిరెడ్డి , బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ, పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు, విద్యుత్ ,అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్యాటక ,సాంస్కృతిక ,యువజన వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంరెడ్డి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులతో ఎమ్మెల్యేలుగా పొట్రెం స్పీకర్ ప్రమాణం చేయించారు.

హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి తావేటి వనిత, రవాణా, సమాచార పౌరసరఫరాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు. రోజాతో పాటు పలువురి వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు ప్రమాణం చేయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories