logo

ఏపీలో నామినేషన్ల జాతర

ఏపీలో నామినేషన్ల జాతర

ఏపీలో ఎమ్మెల్యే నామినేషన్ల జాతర జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు నాలుగు ఎమ్మెల్యే కోటా, రెండు గవర్నర్ కోటా, ఒకటి స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలను భర్తీ చేశారు. ఎమ్మెల్యే కోటా కింద యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, బీటీ నాయుడు పేర్లు ఖరారు చేశారు. అలాగే, గవర్నర్ కోటాలో శివనాథ్‌రెడ్డి, శమంతకమణి పేర్లు, విశాఖ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా బుద్దా నాగజగదీశ్వరరావు పేరును ఖరారు చేశారు. దీంతో ఈ అభ్యర్థులంతా ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు.

లైవ్ టీవి

Share it
Top