తొలి విడత నామినేషన్ల ఘట్టానికి తెర

తొలి విడత నామినేషన్ల ఘట్టానికి తెర
x
Highlights

సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు సంబంధించి...

సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టం ముగిసినట్లయ్యింది. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ఇవాళ చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, చిన్నా చితకా పార్టీల నేతలు కూడా నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ఉరుకులు పరుగులు పెట్టారు.

అఢ్యర్థులు దాఖలు చేసి నామినేషన్ల పరిశీలన రేపు జరుగుతుంది. పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక నిబంధనలకు విరుద్ధంగా అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను పరిశీలించి తిరస్కరిస్తారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే అంశంపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత స్థానాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి వారికి గుర్తులను కేటాయిస్తారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికలు జరిగే 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. మే 23న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికలు జరిగే 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌‌లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు, తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు కూడ అదే రోజు నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 18న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా అప్పటికి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మొదట్లో మందకొడిగా సాగింది. శుక్రవారం మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యలో సెలవలు రావడంతో ఇవాళ చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories