Top
logo

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
X
Highlights

దేశ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు జరిగే 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ...

దేశ వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు జరిగే 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్ధానాలకు కూడా ఉప సంహరణ గడువు ముగిసింది. ఇక దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న నిజామాబాద్ లోక్‌సభ బరిలో 178 రైతులతో పాటు 185 మంది పోటీపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 178 మంది రైతులతోపాటు వివిధ పార్టీలకు చెందిన 7 మంది నామినేషన్లు వేశారు. ఇవాళ నలుగురు రైతులు మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారు. జగిత్యాలకు చెందిన తిరుపతిరెడ్డి, నల్ల వినోద్, మోతె గ్రామానికి చెందిన నల్ల బాలకిషన్, ఇండిపెండెంట్ అభ్యర్థి సింది బాపురావు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ బ్యాలెట్ యుద్ధం తప్పడం లేదు. తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు బ్యాలెట్ విధానానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

Next Story