బోసిపోయిన ఏపీ కాంగ్రెస్ కార్యాలయం

బోసిపోయిన ఏపీ కాంగ్రెస్ కార్యాలయం
x
Highlights

ఓ వైపు పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకవుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఆ వెంటనే ఎన్నికల ప్రచారానికి...

ఓ వైపు పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకవుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఆ వెంటనే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి అయినా ఆ జాతీయ పార్టీలో మాత్రం కదలిక లేదు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కనీస సందడి కానరావడం లేదు. జెండా పట్టుకున్న కార్యకర్త కూడా కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల జాబిత విడుదల చేస్తామని చెప్పుకుంటున్న ఏపీ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుంది..?

ఇది విజయవాడలోని జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవనం. మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లో సందడి కనిపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఇలా మూగబోయింది. ఎక్కడ చూసినా తాళాలు వేసిన చాంబర్లు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. కనీసం కార్యకర్తల సందడి కూడా కరువైంది.

అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి 13 వందలకు పైగా అప్లికేషన్స్‌ వచ్చాయని వాటి స్కౄట్నీ నిర్వహించేందుకే ఇతర ప్రదేశాలకు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని అందుకే పార్టీ కార్యాలయానికి రావడం లేదని చెబుతున్నారు. ఏదేమైనా అభ్యర్థుల ఎంపికపై మంతనాలు జరుగుతున్నందుకే పార్టీ కార్యాలయం బోసిపోతుందని కవర్‌ చేసుకుంటున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories