సీటు ఇవ్వకుంటే చనిపోతా: వైసీపీ ఎమ్మెల్యే

X
Highlights
ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో...
Chandram16 March 2019 3:07 PM GMT
ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో తనకు సీటు కేటాయించకపోతే మాత్రం చనిపోతానంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. మూడు రోజుల నుంచి సునీల్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మనస్థాపానికి గురయ్యారు. కాగా సునీల్ కుమార్‌కు ఈ సారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఇలా బెదిరింపులకు పాల్పపడ్డాడు.
Next Story