కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. ఒంటరిగానే పోటీ

కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. ఒంటరిగానే పోటీ
x
Highlights

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ శాఖ కన్వీనర్ గోపాల్ రాయ్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని తెలిపారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ శాఖ కన్వీనర్ గోపాల్ రాయ్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఆప్ సొంతంగానే పోటీ క్లారిటీ ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసం తాము కాంగ్రెస్ విషాన్ని తాగడానికి సిద్ధమయ్యామని, అయితే కాంగ్రెస్ ఇప్పటికీ దురహంకారంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆ పార్టీ నేతల ప్రకటనలు తెలియజేస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని, త్వరలోనే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ఆద్మీతో పొత్తుకు ఇష్టపడటం లేదు. కాగా ఇటివల కాంగ్రెస్ పార్టీ డీల్లీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన షీలా దీక్షిత్‌ మాట్లాడుతూ అసలు రాజకీయాలంటేనే సవాళ్లనీ, తమకు బీజేపీ, ఆమ్ఆద్మీపార్టీ ‎ఒక సవాల్ అని ఇరుపార్టీలను తప్పకుండా కలిసి కట్టుగా ఎదుర్కొంటామని షీలా స్ఫష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories