నిజామాబాద్ టు వారణాసి..

నిజామాబాద్ టు వారణాసి..
x
Highlights

నిజామాబాద్ పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీకి రెడీ అవుతున్నారు. స్వతంత్ర ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు 50 మంది రైతులు వారణాసి...

నిజామాబాద్ పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీకి రెడీ అవుతున్నారు. స్వతంత్ర ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు 50 మంది రైతులు వారణాసి వెళ్తునున్నారు. నిజామాబాద్ రైతులకు తోడు తమిళనాడు లోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన మరో 100 మంది రైతులు సైతం నామినేషన్లు వేసే అవకాశం ఉంది. దీంతో మరోసారి పసుపు రైతుల సమస్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది.

నిజామాబాద్ పసుపు రైతులు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోకసభ స్థానం నుంచి పోటి చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. వారణాసి నుంచి ప్రదాని మోడీ పోటి చేస్తువుండటంతో ఇదే లోకసభ స్థానం నుంచి పోటిచేస్తే పసుపు రైతుల సమస్య మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న ఉద్దేశ్యంతో పసుపు రైతులు ఈ నిర్ణయం తీసుకునట్లు ప్రకటించారు.వారణాసి లోకసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఈనెల 25న వారణాసికి వెళ్తున్నారు. అక్కడి చేరుకున్న తర్వాత పోటిచేసే రైతులంతా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 27వతేది నామినేషన్ వేస్తామని ప్రకటించారు. రైతుల నామినేషన్లు బలపరిచేందుకు వారణాసి రైతు సంఘాల మద్దతు తీసుకోనున్నారు.

నిజామాబాద్ పసుపు రైతులకు తోడు తమిళనాడులోని ఈ రోడ్ ప్రాంతానికి చెందిన మరో 100మంది పసుపు రైతులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నిజామాబాద్ లోని ఆర్మూర్ డివిజన్‌లో పసుపు పంట కు ఏంత ప్రాముఖ్యత ఉందో.. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతం కూడ పసుపు పంట అంత ఫేమస్. అందుకే వారు కూడా నిజామాబాద్ రైతులకు మద్దతు ప్రకటించి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే పసుపు సమస్య పరిష్కారం అవుతుందని రైతులు భావిస్తున్నారు.

వారణాసి బరిలో నామినేషన్లు ఉపసంహరణ తర్వాత.. కనీసం 100 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉంటే అక్కడ కూడా ఒక పోలింగ్ కేంద్రంలో 8 నుంచి 12 ఈవీఎంలను ఒక కంట్రోల్ యూనిట్, ఒక వివి ప్యాట్ కు అనుసందానం చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే దేశ చరిత్రలో నిజామాబాద్ తర్వాత వారణాసి లోకసభ స్థానం కూడ చరిత్రలో నిలుస్తుంది. మొత్తానికి మరోసారి పసుపు రైతుల సమస్య దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. నిజామాబాద్ బరిలో నిలవడం ఒక ఎత్తైతే ఏకంగా ప్రధాని మోడీ పోటీచేస్తున్న వారణాసి నుంచి బరిలో నిలవడం మరో ఎత్తు కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మరోసారి పసుపు రైతుల పై పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories