చలో వారణాసి...పసుపు రైతులు మరోసారి....

చలో వారణాసి...పసుపు రైతులు మరోసారి....
x
Highlights

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు మరోసారి బ్యాలెట్ పోరుకు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో నామినేషన్లు వేసేందుకు...

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు మరోసారి బ్యాలెట్ పోరుకు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో నామినేషన్లు వేసేందుకు ఆర్మూర్ నుంచి సుమారు 50 మంది రైతులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. వీరికి తెలంగాణ పసుపు రైతుల సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం ద్వారా పసుపు సమస్య మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వస్తుందని రైతులు భావిస్తున్నారు.

ప్రధానిపై పోటీ చేసేందుకు తాము స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని రైతులు స్పష్టం చేశారు. తమ నామినేషన్లను తెలంగాణతో పాటు వారణాసిలోని రైతులు, రైతు సంఘాల నాయకులు బలపరుస్తారని అన్నారు. వారణాసిలో రైతుల నామినేషన్ల అంశంపై రైతు ఐక్య కార్యచరణ కమిటీ స్పందించింది. వారణాసిలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన రైతులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. రెండు నెలల పాటు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే తెలంగాణ రైతు సంఘం ఎక్కడికి వెళ్లిందని రైతు జేఏసీ నేతలు ప్రశ్నించారు. ప్రధానిపై నామినేషన్లు వేసేందుకు వెళ్లిన రైతుల అంశం దేశస్థాయిలో హాట్ టాఫిక్‌గా మారింది. మరి వీరిలో ఎంత మంది బరిలో ఉంటారో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories