నిజామాబాద్‌ పసుపు బోర్డుపై టీఆర్‌ఎస్‌ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం

నిజామాబాద్‌ పసుపు బోర్డుపై టీఆర్‌ఎస్‌ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం
x
Highlights

నిజామాబాద్‌ పసుపు బోర్డుపై టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశమే లేదన్న కవిత బీజేపీ మరోసారి భారతీయ...

నిజామాబాద్‌ పసుపు బోర్డుపై టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశమే లేదన్న కవిత బీజేపీ మరోసారి భారతీయ ఝూట్ పార్టీ అని నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. అయితే కవిత కామెంట్స్‌కు కౌంటరిచ్చిన బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌ తాను గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకొస్తానని, లేదంటే రాజీనామాచేసి రైతులతో కలిసి ఉద్యమిస్తానని సవాలు విసిరారు. నిజామాబాద్‌ పసుపు బోర్డుపై టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వందలసార్లు కేంద్రానికి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోని బీజేపీ నేతలు ఎన్నికలొచ్చాక చిలక పలుకుతున్నారని కవిత ఫైరయ్యారు. ఓట్ల కోసం నిజామాబాద్‌లో పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో చేరుస్తామన్న రాంమాధవ్‌ మాట తప్పారని కవిత మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోలో అసలు నిజామాబాద్‌ పసుపు బోర్డు అంశమే లేదన్న కవిత, బీజేపీ మరోసారి భారతీయ ఝూట్ పార్టీ అని నిరూపించుకుందని ఎద్దేవా చేశారు.

కవిత కామెంట్స్‌కు నిజామాబాద్‌ బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌ కౌంటరిచ్చారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టమైన హామీ ఇచ్చారంటూ వీడియో రిలీజ్ చేశారు. ఓటమి భయంతోనే కవిత దుష్ప్రచారం చేస్తున్నారని, అవాస్తవాలను రైతన్నలు, మహిళలు నమ్మరని అన్నారు. తాను గెలిచిన వెంటనే పసుపు కొనుగోలు, గిట్టుబాటు ధర కోసం నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తామని, లేదంటే రాజీనామాచేసి రైతులతో కలిసి ఉద్యమిస్తానని ధర్మపురి అర్వింద్ సవాలు విసిరారు. ఇదిలా ఉంటే, నిజామాబాద్‌ ఎన్నికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ఎన్నికను వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. అయితే ఇండిపెండెంట్స్‌కు ఇంకా గుర్తులు కేటాయించలేదని, ఎన్నికను వాయిదా వేయాలని పిటిషనర్‌ కోరడంతో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు నోటీసులిచ్చిన హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories