నిజామాబాద్‌లో వింత హోలీ...ఒళ్లు హునమయ్యేలా...

నిజామాబాద్‌లో వింత హోలీ...ఒళ్లు హునమయ్యేలా...
x
Highlights

హోళీ పండుగ వస్తే దేశమంతా సంబరాల్లో మునిగిపోతుంది. ఒకరిపై ఒకరు రంగులు వేసుకొని హోలీని జరుపుకుంటారు. అయితే నిజామాబాద్‌ జిల్లా హున్సాలో మాత్రం వెరైటీ...

హోళీ పండుగ వస్తే దేశమంతా సంబరాల్లో మునిగిపోతుంది. ఒకరిపై ఒకరు రంగులు వేసుకొని హోలీని జరుపుకుంటారు. అయితే నిజామాబాద్‌ జిల్లా హున్సాలో మాత్రం వెరైటీ చేసుకుంటారు. ఒళ్లు హునమయ్యేలా కొట్టుకుంటారు. కొట్టుకోవడం పూర్తికాగానే ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు.

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా హున్సా గ్రామంలో హోలీ పండుగను వినూత్నంగా చేసుకుంటారు. రెండు స్తంభాల మధ్య తాడు కట్టి అటూ ఇటూ జనం పరిగెత్తుతూ కేరింతలు వేస్తూ ఒకరికొకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఇందులో ఎవరికి గెలుపోటములు ఉండవు. అంతా ఉత్సాహంగా చేసుకునే రంగుల ఉత్సవమే.

హున్సాలో 450 ఏళ్లుగా పిడిగుద్దులాట ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆటలో ఎలాంటి గాయమైనా గ్రామస్తులు లైట్ తీసుకుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా మట్టిని రాస్తే వాటంతట అవే తగ్గిపోతాయని హున్సా గ్రామస్తుల నమ్మకం. ఇంత పెద్దెత్తున ఫైటింగ్ జరిగినా గ్రామస్తుల మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండదు. అందుకే ఆట పూర్తవ్వగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

ఆట ముగిశాక కామదహనం బూడిదను ఒంటికి రాసుకుంటారు. హున్సాలో ఓ ఏడాది పిడిగుద్దులాటను ఆపేస్తే...గ్రామానికి కీడు జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే ఈ ఆటను మాత్రం ఆపేది లేదంటున్నారు ప్రజలు. ఇక ముందు కూడా ఈ ఫైటింగ్ హోలీ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories