వివాదాల మధ్య ముగిసిన తొలిదశ ఈవీఎంల పరిశీలన

వివాదాల మధ్య ముగిసిన తొలిదశ ఈవీఎంల పరిశీలన
x
Highlights

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న రైతులు అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పట్ల ఏ మాత్రం అవగాహన కలిగించలేదని గుర్తులు...

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న రైతులు అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పట్ల ఏ మాత్రం అవగాహన కలిగించలేదని గుర్తులు కేటాయించలేదని ప్రచారం ఎలా నిర్వహించాలంటున్న రైతులు ఎన్నిక వాయిదాపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. మరో వైపు అత్యధికంగా 185 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండటంతో చాలెంజ్ గా తీసుకున్న ఎన్నికల అధికారులు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక నిర్వహణకు యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తొలిదశ ఈవీఎంల పరిశీలన వివాదాల మధ్య ముగిసింది. స్వతంత్య అభ్యర్ధులు ఈవీఎంల పరిశీలన బహిష్కరించారు. పరిశీలనలో జాప్యంపై రైతులు ఆందోళన చేశారు. హైడ్రామా మద్య ఈవీఎంల పరిశీలన పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు.

ఈవీఎంల అవగాహనకు పిలిచి అర్ధాంతరంగా వాయిదా వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహాన కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తమకు గుర్తులు కేటాయించలేదని, ఎలా ప్రచారం నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వాయిదా పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఎన్నికను కనీసం పది రోజులు వాయిదా వేయాలంటూ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న రైతులు ఎన్నికల సంఘాన్ని కోరారు. గుర్తులకు సంబంధించి ఇంతవరకూ నమూనా చిత్రాలు ఇవ్వలేదని తాము క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోలేక పోతున్నామని అభ్యర్ధులు చెబుతున్నారు. ఈవీఎంలతో ఎన్నికలపై తమకు అనుమానాలున్నాయని అన్నారు. స్థానిక ఎన్నికల అధికారి స్వతంత్ర అభ్యర్థులకు సహకరించడంలేదని ఆరోపించారు.

రైతుల ఆందోళనతో ఈవీఎం అవగాహన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికల నిర్వహాణ,గుర్తులపై అవగాహన కల్పిస్తామని పిలిపించి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. మరో వైపు రైతుల ఆందోళనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రోడ్డు పై బైఠాయించిన వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఎలాంటి ఆందోళనలు చేపట్ట వద్దని సూచించారు పోలీసుల సూచనతో శాంతించిన రైతులు ఆందోళన విరమించినా ఎన్నిక నిర్వాహణకు ఎంత వరకు సహకరిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories