మోడీకి హామీ ఇస్తున్నా.. 40 స్థానాల్లో గెలుస్తాం

X
Highlights
రానున్న లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహారచన సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు...
Chandram4 March 2019 8:32 AM GMT
రానున్న లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహారచన సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 లోక్సభ స్థానాల్లో తాము విజయకేతనం ఎగురవేస్తున్నామని ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇస్తున్నానని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ తిరిగి మోడీని ప్రధానమంత్రిని చేస్తామని పెర్కోన్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన సంకల్ప్ ర్యాలీలో మోడీతో పాటు నితీష్ పాల్గొన్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న భారత ప్రధాని మోడీని సీఎం నితీష్ కొనియాడారు. ఉగ్రవాదం విషయంలో రాజీ పడే సమస్య లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Next Story