లోక్‌సభలో రఫేల్‌ రగడ...2 గంటల పాటు నాన్‌ స్టాప్‌ ఎటాక్‌

Parliament
x
Parliament
Highlights

రఫేల్‌ ఢీల్ లోక్‌సభను మరోసారి కుదిపేసింది. గత కొన్నాళ్లుగా ప్రధాని మోడీ, తనపైనా కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్‌ ఆరోపణలకు సమాధానం చెబుతూ సభలో విశ్వరూపం ప్రదర్శించారు.

రఫేల్‌ ఢీల్ లోక్‌సభను మరోసారి కుదిపేసింది. గత కొన్నాళ్లుగా ప్రధాని మోడీ, తనపైనా కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్‌ ఆరోపణలకు సమాధానం చెబుతూ సభలో విశ్వరూపం ప్రదర్శించారు. అయితే రఫేల్‌ ఒప్పందాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని రాహుల్‌ ప్రశ్నించారు. కుంభకోణంలో ప్రధాన పాత్రదారులు ప్రధాని మోడీ అని చెప్పుకొచ్చారు.

రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై దీర్ఘకాలంగా ఆరోపణలెదుర్కొంటున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో అపరకాళిక అవతారమెత్తారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం ఇచ్చిన డిఫెన్స్‌ మినిస్టర్‌ సుమారు 2 గంటల పాటూ సుదీర్ఘంగా చెలరేగిపోయారు. కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి రాహుల్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై అత్యంత ఘాటుగా, మునుపెన్నడూ లేనంత ఆవేశంతో స్పందించారు. ప్రధానిని పదే పదే చోర్ చోర్ అని సంబోధించడంపై మండిపడ్డ ఆమె వ్యక్తుల పేర్లు తీసి దిగజారి విమర్శలు చేస్తున్నారంటూ ఆవేశంతో ఊగిపోయారు.

అలాగే తనపై నిందలేయడం పైనా విరుచుకు పడ్డారు. తమకు అందరిలా ఖాన్ దాన్ లు, ఎస్టేట్ లు లేవంటూ పరోక్షంగా రాహుల్ కి చురకలంటించారు. అంతేకాదు రక్షణ ఒప్పందాలపైనా కొత్త నిర్వచనం ఇచ్చిన ఆమె తనస్టైల్‌లో వివరించారు. సభలో వ్యక్తుల అనుభవానికి, హోదాకు, పదవులకు తగిన గౌరవం లేదని, అత్యున్నత స్థాయి వ్యక్తిమీద కూడా అలవోకగా నిందలు వేసేయగలరంటూ రక్షణమంత్రి మండిపడ్డారు.

అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్టు ఇవ్వడంపై డబుల్ ఏ అని సంభోధిస్తూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయడంపై నిర్మలా సీతారామన్‌ తిప్పికొట్టారు. షార్ట్ కట్ పేర్లతో హేళనగా మాట్లాడటం సులభంగానే ఉంటుందని, కానీ అది రెండువైపులా పదునైన కత్తిలాంటిదనీ, ఒక్కోసారి అది వికటిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

హాల్ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వలేదని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని కానీ యూపీఏ హయాంలో ఆ సంస్థ నిలబడటానికి ఏం చేశారని నిలదీశారు. ప్రధానిని ఫ్రెంచ్ ప్రధాని దొంగ అన్నారంటూ పదే పదే చెబుతున్న కాంగ్రెస్ అందుకు ప్రూఫ్ చూపాలని ఆధారాలు లేకుండా మాట్లాడొద్దనీ హెచ్చరించారు.

అయితే నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్‌ గాంధీ రాఫెల్ ఒప్పందాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టు అనిల్ అంబానీకి ఏ విధంగా వెళ్లిందని అడిగిన ఆయన తాము రక్షణమంత్రిని కానీ పారికర్ ను కానీ నిందితులుగా చూపించడం లేదన్నారు. రాహుల్ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి మోడీ అని రాహుల్‌ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై బదులిచ్చిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ను పాయింట్‌ టూ పాయింట్‌ సమాధానాన్ని ఇచ్చి స్పీకర్‌ అభినందనలు అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories