పాఠశాలలో మద్యం తాగిన విద్యార్థినులు

ప్రతీకాత్మక చిత్రం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

విజయవాడ రూరల్ లోని నిడమనూరు గ్రామంలో శనివారం చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ అవాక్ అయ్యేలా చేసింది. చెడు సహవాసాలు, తెలిసీ తెలియని తనంతో ఇద్దరు...

విజయవాడ రూరల్ లోని నిడమనూరు గ్రామంలో శనివారం చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ అవాక్ అయ్యేలా చేసింది. చెడు సహవాసాలు, తెలిసీ తెలియని తనంతో ఇద్దరు విద్యార్థినులు తప్పటడుగులు వేసేందుకు ప్రోత్సహించింది. అందరి ముందూ దోషులుగా నిలబడేలా చేసింది. నిడమానూరు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ లో మద్యం తాగిన ఘటన అందరినీ ఆహ్చర్యపరిచింది పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తమ వెంట తెచ్చుకున్న మందుని డ్రింక్ లో మిక్స్ చేసుకొని తరగతి గదిలోనే తాగారు. ఆపై తాగిన మైకంలో తోటి విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తిస్తూ హడావుడి చేశారు.

ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా అతను బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వైద్యుడి సమక్షంలో బాలికలు మద్యం తాగారని నిర్థారించారు. దీంతో బాలికలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వీరి ప్రవర్తన తోటి విద్యార్థులకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థినులకు టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి పంపించారు. మద్యం తాగిన ఇద్దరు విద్యార్థినులతో మిగిలిన విద్యార్థులకు కూడా నష్టం కలుగుతుందన్న కారణంతో టీసీలు ఇచ్చినట్లు హెడ్ మాస్టర్ తెలిపారు.

స్కూలు బయట కొందరు ఆకతాయిలు విద్యార్థులను ట్రాప్ చేసి వారికి మందు అలవాటు చేస్తునట్లు తెలుస్తోంది కొన్ని రోజుల క్రితం పలువురు విద్యార్థులు తాగి రోడ్డుపై పడిపోయినట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పుడు విద్యార్థినిలకు కూడా ఆ ఆకతాయిలే మద్యం అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలో పక్కా చర్యలు చేపడుతున్నామని హెడ్ మాస్టర్ తెలిపారు అన్ని తరగతి గదుల్లోనూ, హాస్టల్స్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories