Top
logo

కలకలం సృష్టిస్తోన్న ఎన్‌ఐఏ సోదాలు

కలకలం సృష్టిస్తోన్న ఎన్‌ఐఏ సోదాలు
X
Highlights

హైదరాబాద్‌ శివారులో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌ పల్లి,...

హైదరాబాద్‌ శివారులో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌ పల్లి, శాస్త్రిపురంలో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. స్థానిక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, ఎన్‌ఐఏ సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐసిస్‌ ఉగ్రవాది , హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నఎన్‌ఐఏ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాట్లు సమాచారం.

రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేత హత్యకు ఐసిస్‌ ఉగ్రవాది బాసిత్ టీం కుట్ర పన్నడాన్ని ఎన్‌ఐఏ పసికట్టింది. అప్పట్లో నలుగురు యువకులు పట్టుబడటంతో ఈ కుట్న భగ్నమైంది. దీంతో టెర్రరిస్ట్లో బాసిత్ హైదరాబాద్ కి మకాం మార్చాడు. తర్వాత హైదరాబాద్‌లో నలుగురు యువకులకు AK-47 సమకూర్చాడు. బాసిత్ అనుచరులు తలదాచుకుంటున్నారన్న సమచారంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Next Story