Top
logo

ఎన్ఐఏ ఛార్జి షీట్ లో వెలుగుచూసిన సంచలన అంశాలు

ఎన్ఐఏ ఛార్జి షీట్ లో వెలుగుచూసిన సంచలన అంశాలు
X
Highlights

దేశ వ్యాప్తంగా కొత్త తరహాదాడులకు స్కెచ్ వేశారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్...

దేశ వ్యాప్తంగా కొత్త తరహాదాడులకు స్కెచ్ వేశారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. ఢిల్లీలో భారీ విధ్వంసాలకు హైదరాబాద్ కేంద్రంగా వ్యూహరచన చేశారు. ఎన్ఐఏ అధికారుల అలర్ట్ తో భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీలో నలుగురు యువకులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఇండియాను టార్గెట్ చేసుకుని హైదరాబాద్ యువతను బుట్టలో వేసుకుంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.

హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీలో భారీకుట్రకు వ్యూహరచన చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. ఇందుకు హైదరాబాద్ యువకులే కీ రోల్ గా వ్యవహరించినట్లు ఎన్ఐఏ ఆపరేషన్ లో వెల్లడయ్యింది. తాజాగా ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జి షీట్ లో సంచలన అంశాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ లో ఉంటూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు అట్రాక్ట్ అయిన బాసిత్ సిరియా వెళ్లి పూర్తి స్థాయి యాక్టీవ్ రోల్ ప్లే చేయాలని ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించారు. పక్కా సమాచారంతో బాసిత్ అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు.

ఇంటర్నెట్ సాయం, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఐఎస్ఐఎస్ డాక్యూమెంటరీలు వాటి యాక్టివిటీని బాసిత్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. తాజాగా ఎన్ఐఏ కోర్టులో చార్జ్ షిట్ దాఖలు చేసింది. రెండేళ్ల క్రితం బాసిత్ తన స్నేహితులు ఐసీసీ వైపు వెళ్లేందుకు పలు మార్లు ప్రయత్నాలు చేయడాన్ని సిటీ పోలీసులు గుర్తించారు. బాసిత్ కుటుంబ సభ్యులను బైండోవర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అప్పటి నుంచి నిఘా కొనసాగిస్తున్న ఎన్ఐఏ బాసిత్ ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్లు గుర్తించారు.

ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేత హత్యకు ఐసీసీ ఆదేశించడంతో బాసిత్, మరో నలుగురు యువకులు వెళ్లారు. ఎన్ఐఏ అలర్ట్ కావడంతో ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో బాసిత్ హైదరాబాద్ తిరిగొచ్చాడు. నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న ఎన్ఐఏ హైదరాబాద్‌లో బాసిత్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. బాసిత్ ఎవరెవరితో టచ్ లో ఉంటున్నాడో గుర్తించారు. ఏది ఎమైనా భారీ వ్యూహానికి చెక్ పెట్టారు ఎన్ఐఏ అధికారులు. బాసిత్, ఖదీర్ కాకుండా ఇండియా నుంచి మరెవరైనా ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నారా అనే కోణంపై ఎన్ఐఏ దృష్టి సాధించింది.

Next Story