సఫారీలపై కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ ..

సఫారీలపై కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న దక్షిణాప్రికా మరియు న్యూజిలాండ్ జట్లు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది .. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ...

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న దక్షిణాప్రికా మరియు న్యూజిలాండ్ జట్లు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది .. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది .. దీనితో అ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది .. మొదటగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన దక్షిణాప్రికా ఆరు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది . దక్షిణాప్రికా బాట్స్ మెన్స్ లో హషీమ్ ఆమ్లా (55 పరుగులు), డస్సెన్ (67 నాటౌట్) మాత్రమే రాణించారు ..

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది . అ జట్టు 12 పరుగులకే వద్ద ఓపెనర్ మన్రో వికెట్ ని కోల్పోయింది .. అ తర్వాత కివీస్‌ను గప్టిల్ (35), కేన్ విలియమ్సన్ (103*) ఆదుకున్నారు. ఇక గప్టిల్ అవుటయ్యాక.. రాస్ టేలర్, టామ్ లాథమ్ కూడా వెనువెంటనే అవుటయ్యారు. దీంతో 80 పరుగులకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది .. కెప్టెన్ విలియ్సమన్‌తో జతకట్టిన జేమ్స్ నీషామ్ (23) ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు.

నీషామ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన గ్రాండ్‌హోమ్ (60) అర్ధ శతకంతో రాణించాడు. 47 ఓవర్లలో 228 రన్స్ చేసిన కివీస్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ గ్రాండ్‌హోమ్ కూడా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఇక ఆఖరి ఓవర్లో కివీస్ విజయానికి 8 పరుగులు అవసరం అయ్యాయి. సిక్స్ బాది శతకం పూర్తి చేసుకున్న విలియమ్సన్ సింగిల్ తీసి కివీస్ కి విజయాన్ని అందించాడు . సౌతాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్ 3 వికెట్లు పడగొట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories