Top
logo

సినీనటి భానుప్రియ చైల్డ్ లేబర్ కేసులో మరో ట్విస్ట్

సినీనటి భానుప్రియ చైల్డ్ లేబర్ కేసులో మరో ట్విస్ట్
X
Highlights

సినీనటి భానుప్రియ చైల్డ్ లేబర్ కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఆమె ఇంట్లో సంధ్యతో పాటు మరో ముగ్గురు బాలికలు...

సినీనటి భానుప్రియ చైల్డ్ లేబర్ కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఆమె ఇంట్లో సంధ్యతో పాటు మరో ముగ్గురు బాలికలు పనిచేస్తున్నట్టు చైల్డ్ లైన్ అధికారులు గుర్తించారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన తలారి శైలు, పనిపెళ్లి రత్నప్రభలతో పాటు మరో బాలిక ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2017లో అదే గ్రామానికి చెందిన నూతాటి సోమరాజు అనే వ్యక్తి భానుప్రియ ఇంటిలో పనికి పంపించినట్టు తెలుస్తోంది. కాకినాడ పారా స్వచ్ఛంద సంస్థ వీళ్లను గుర్తించి రాజమండ్రి చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వడ్లమూరు చేరుకుని విచారణ జరుపుతున్నారు అధికారులు.

Next Story