logo

ఇంద్రకీలాద్రిలో ఇక నుంచి కొత్త రూల్

బెజవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రొటోకాల్ రూల్ అమలుకు నిర్ణయించారు.

IndrakeeladriIndrakeeladri

బెజవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రొటోకాల్ రూల్ అమలుకు నిర్ణయించారు. ఇదేమీ రూల్ అనుకుంటున్నారా..? రాజకీయ నాయకులను కట్టడి కోసం ప్రత్యేకంగా అమలు చేసేందుకు తీసుకు వచ్చిన కొత్తరూల్.

సంస్కృతి, సాంప్రదాయాలకు ఆనవాళ్లుగా ఉన్న దేవాలయాల్లో ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు అశ్లీలతకు తావులేకుండా పాలకులు చూస్తుంటారు అయినా కొంత కాలంగా రాజకీయ నాయకుల తీరు మారటం లేదు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతొ ఆలయా అధికారులు మెల్కోన్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు.

ఇక నుంచి ఆలయాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు వ్యాఖ్యలు చేయకూడదంటూ దుర్గ గుడికొత్తగా ప్రొటోకాల్ రూల్ పాస్ చేసింది. రాజకీయా పార్టీ నేతలు ఎవరూ అమ్మవారి దేవస్ధానంలో రాజకీయాలు మాట్లాడకూడదని విన్నవిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేవలం మాటాలే కాదు ఆలయ ప్రాంగణం పరిసరా ప్రాంతాల్లొ ఎటువంటి రాకీయాలకు సంబంధించిన ప్లెక్సీలు, నినాదాలు, కాన్వాయ్ తో ఆలయ ముఖద్వారంకి రాకుండా, అనుచరణ గణంతొ ఆలయంలొకి రాకూడదంటూ సూచనలు జారీ చేశారు.

మొదటి నుంచి ఆలయాల్లొ రాజకీయ నాయకుల ఆధీపత్యం ఉంటుంది. అందుకు దుర్గగుడి అంటే రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడా అధికార పార్టీ నేతలు ఏది చెప్పితే ఆదే శాసనం. ఇటువంటి సంఘటనలు గతంలొ అనేకం జరిగాయి. కొత్తగా అమలు చేయబోతున్న ప్రొటోకాల్ రూల్ తోనైనా మార్పువస్తుందని భావిస్తున్నారు. ఆలయప్రతిష్ట కాపాడే దిశగా అధికారుల ప్రయత్నం సఫలం కావాలని అంతా కోరుకుంటున్నారు.

లైవ్ టీవి

Share it
Top