ప్రాణాలతో‌ చెలగాటం

ప్రాణాలతో‌ చెలగాటం
x
Highlights

కుమ్రంభీమ్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి స్టాఫ్ నర్సు డెలివరీ చేసింది. అయితే ప్రసవం...

కుమ్రంభీమ్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి స్టాఫ్ నర్సు డెలివరీ చేసింది. అయితే ప్రసవం తర్వాత శిశువు మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు. నర్సు నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైద్యుల నిర్లక్ష్యం పసికందుల ప్రాణాలు బలితీసుకుంటోంది. భూమ్మీద పడకుండానే పసిగొంతుకలు మూగబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు ప్రభుత్వాసుపత్రిలోనూ ఆసిఫాబాద్‌ లాంటి ఘటనే జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో పొత్తిళ్లలోనే పసికందు ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం చేసేందుకు నర్సులు ప్రయత్నించడంతో ఈ దారుణం జరిగింది.

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సూపర్ వైజర్‌ ప్రసవం చేశాడు. అయితే పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూసింది.

ప్రభుత్వాస్పత్రుల్లో నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తోంది సమయానికి వైద్యులు అందుబాటులో ఉండరు సరైన సదుపాయాలు ఉండవు వెరసి ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు చేయాల్సిన చికిత్సలను సిబ్బందే చేస్తున్నారు. ఫలితంగా పురిటిలోనే పసిప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై ఒకపక్క ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తుంటే మరోపక్క వైద్యుల తీరు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories