భారత జలాంతర్గామిని అడ్డుకున్నామన్న పాక్ ఆరోపణ..తిప్పికొట్టిన భారత్

భారత జలాంతర్గామిని అడ్డుకున్నామన్న పాక్ ఆరోపణ..తిప్పికొట్టిన భారత్
x
Highlights

అబద్ధాల పాకిస్థాన్‌ నాటకాలు ఆపడం లేదు. ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ గురించి రకరకాల విన్యాసాలు చేసిన దాయాది దేశం ఇప్పుడు మరో కొత్త నాటకానికి తీసింది....

అబద్ధాల పాకిస్థాన్‌ నాటకాలు ఆపడం లేదు. ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ గురించి రకరకాల విన్యాసాలు చేసిన దాయాది దేశం ఇప్పుడు మరో కొత్త నాటకానికి తీసింది. తమ జలాల్లోకి ప్రవేశించేందుకు భారత జలాంతర్గామి యత్నించగా అడ్డుకున్నామని చెప్పుకొచ్చింది. దీనికి సాక్ష్యంగా ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అయితే సబ్‌మెరైన్ గురించి పాకిస్థాన్ చెబుతోన్నదంతా అబద్ధమని మన దేశం ప్రకటించింది.

పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించిందని చెబుతున్న భారత జలాంతర్గామి ఇదే. నీటిపై కాస్త తేలుతున్నట్లుగా వెళ్తున్న సబ్‌మరైన్‌ను గగనతలం నుంచి చిత్రీకరించారు. ఈ నెల 4 రాత్రి ఎన్నిమిదిన్నర సమయంలో తీసినదంటూ దాయాది దేశం ఈ వీడియోను విడుదల చేసింది. భారత్‌కు చెందిన సబ్‌మెరైన్ పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించేందుకు యత్నించగా అడ్డుకున్నామని ఆ దేశ నేవీ ప్రకటించింది. తమ దగ్గర ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలను ఉపయోగించి సబ్‌మరైన్‌ను తమ జలాల్లోకి రాకుండా అడ్డుకున్నామని పాకిస్థాన్ నేవీ అధికారులు చెప్పారు. అంతేకాదు పాక్ ప్ర‌భుత్వం తీసుకున్న శాంతి చ‌ర్య‌ల్లో భాగంగా ఆ స‌బ్‌మ‌రైన్‌ను టార్గెట్ చేయ‌కుండా వదిలేశామ‌ని చెప్పుకొచ్చారు.

పాక్‌ ప్రాదేశిక జలాల్లో మన జలంతర్గామి ప్రవేశించినట్టు ప్రకటించిన చేసిన పాకిస్థాన్ ఆరోపణల్ని భారత్ తిప్పికొట్టింది. మన సబ్‌మెరైన్స్ అన్నీ భారత జలాల్లోనే ఉన్నట్టు స్పష్టం చేసింది. దేశ రక్షణ విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్నామని పాకిస్థాన్‌ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించింది. భారత సబ్‌మెరైన్ వీడియో 2016 నాటిదై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఈ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేయడం ద్వారా మరో నాటకానికి తెర తీసినట్లు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories