logo

వైఎస్ జగన్‌పై నవసమాజ్‌ పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ జగన్‌పై నవసమాజ్‌ పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై నవసమాజ్‌ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2014లో వైసీపీ పార్టీ నుంచి దెందులూరు టికెట్ కేటాయిస్తాని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మించి తనను మోసం చేశారని చంద్రమౌళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న దళితులకు సరైనా న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని చంద్రమౌళి పిలుపునిచ్చారు. ఇక తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల సంఘం(ఈసీ) తమకు గ్యాస్‌ సిలిండర్‌ గుర్తు కేటాయించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఏపీలో 100 సీట్లలో పోటీ చేసి వైయస్ జగన్‌ మోహన్ కి తగిన బుద్ధిచెబుతామని చంద్రమౌళి హెచ్చరించారు.

లైవ్ టీవి

Share it
Top