టేస్టీగా సాగిన నేషనల్‌ ఫిష్‌ ఫెస్టివల్‌

టేస్టీగా సాగిన నేషనల్‌ ఫిష్‌ ఫెస్టివల్‌
x
Highlights

హైదరాబాద్‌లో నేషనల్‌ ఫిష్‌ ఫెస్టివల్‌ టేస్టీగా సాగింది. వివిధ రకాల చేపల వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. చేపలు, రొయ్యలతో చేసిన స్నాక్స్‌,...

హైదరాబాద్‌లో నేషనల్‌ ఫిష్‌ ఫెస్టివల్‌ టేస్టీగా సాగింది. వివిధ రకాల చేపల వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. చేపలు, రొయ్యలతో చేసిన స్నాక్స్‌, బిర్యానీలు ఘుమఘుమలాడించాయి. వివిధ రుచులు సందర్శకులను నోరూరించాయి. దాంతో తమకు నచ్చిన ఫిష్‌‌ను టేస్ట్‌ చేసి చేపమాంసం ప్రియులు ఎంజాయ్ చేశారు.మృగశిర కార్తె సందర్భంగా నేషనల్‌ ఫిషరీష్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు మూడ్రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ చేపల పండగ సందడిగా సాగింది.

వివిధ రకాల చేపల వంటకాలు భోజన ప్రియుల జిహ్వచాపల్యాన్ని తీర్చాయి. డిఫరెంట్ డిషెస్‌ సందర్శకులను ఆకట్టుకున్నాయి. చేపలు, రొయ్యలతో చేసిన స్నాక్స్‌, బిర్యానీలు ఘుమఘుమలాడించాయి. సందర్శకులు తమకు నచ్చిన చేప వంటకాన్ని ఆరగిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రతి నెలా ఒక రాష్ట్రంలో జాతీయ చేపల పండగ నిర్వహిస్తామని నేషనల్‌ ఫిషరీష్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మూడ్రోజులపాటు నిర్వహించిన ఫిష్‌ ఫెస్టివల్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు.మృగశిర సెంటిమెంట్‌తోపాటు వీకెండ్ కూడా కలిసిరావడంతో ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమకు నచ్చిన చేపల వంటకాలను రుచి చూసి ఆనందించారు. కుటుంబాలతో కలిసొచ్చి సరదాగా ఎంజాయ్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories