అమెరికాలో జాతీయ ఎమర్జెన్సీ

అమెరికాలో జాతీయ ఎమర్జెన్సీ
x
Highlights

చైనా సాఫ్ట్ వేర్ సంస్థపై ట్రాంప్ కళ్లెర్రజేశారు. హువావే సంస్థ పై ఎప్పటి నుంచో అమెరికా మిత్ర దేశాలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. హువావే సంస్థ...

చైనా సాఫ్ట్ వేర్ సంస్థపై ట్రాంప్ కళ్లెర్రజేశారు. హువావే సంస్థ పై ఎప్పటి నుంచో అమెరికా మిత్ర దేశాలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. హువావే సంస్థ చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేషనల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ సంస్థలకు ముప్పు ఉందని చెబుతూ ఈ నిర్ణయాన్ని వెలువరించారు. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్‌ సేవలను వినియోగించకుండా అడ్డుకట్ట వేశారు. కంపెనీ పేరు ఎట్టకపోయినా, ఈ చర్య హువావేను కట్టడి చేయడానికే అని వినిపిస్తోంది. ఇదిలా ఉండగా నేషనల్‌ ఎమర్జెన్సీతోపాటు అమెరికా మరో చర్య కూడా తీసుకొంది. దీని ప్రకారం హువావేపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదు. ఈ చర్యతో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

దీనిపై చైనాకు చెందిన హువావే స్పందించింది. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని పేర్కొంది. తాము ఏ ప్రభుత్వానికి లోబడి పనిచేయడంలేదని తెలిపింది. తమతో వ్యాపారం చేయకుండా ఉన్నంత మాత్రాన అమెరికా భద్రంగా ఏమీ ఉండదని పేర్కొంది. తమతో వ్యాపారం వదులుకొని ఖరీదైన ప్రత్యామ్నాయాలవైపు అమెరికా మళ్లుతోందని తెలిపింది. అమెరికా అర్థంలేని ఆంక్షలు విధిస్తోందని విమర్శించింది. ఇక అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ పై ట్రంప్‌ చర్యను స్వాగతించారు. అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories