logo

ఆ ఊరికి మహాత్మాగాంధీనే దేవుడు

ఆ ఊరికి మహాత్మాగాంధీనే దేవుడు
Highlights

ఆ ఊరికి మహాత్మాగాంధీనే దేవుడు ఉదయాన్నే లేచి పూజలు చేస్తారు. ఏ చిన్న శుభకార్యమైనా గాంధీజీ ప్రార్థనతోనే ప్రారంభిస్తారు.

ఆ ఊరికి మహాత్మాగాంధీనే దేవుడు ఉదయాన్నే లేచి పూజలు చేస్తారు. ఏ చిన్న శుభకార్యమైనా గాంధీజీ ప్రార్థనతోనే ప్రారంభిస్తారు. గ్రామంలో వర్షం పడకపోయినా, ఏదైనా కాస్త కష్టం వచ్చినా జాతిపితనే స్మరిస్తూ తమ కోరికలు కోరుతారు ఇంతకీ గాంధీజీకి గ్రామస్థులు పూజలు చేయడం వెనుక కారణం ఏంటి. గాంధీని గాడ్ గా ఎందుకు పూజిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నర్సింగపూర్ గ్రామం. 1300 మంది జనాభా ఉన్న ఈ చిన్న పల్లె వాసులు జాతి పిత గాంధీని గౌరవించే విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సింగపూర్ గ్రామ నడిబొడ్డున 1961 నవంబర్ 1వ తేదీన అప్పటి గ్రామస్ధులు గాంధీ విగ్రహాం ప్రతిష్టించారు. అప్పటి నుంచి దేవునిలా కొలుస్తూ నిత్య పూజలు చేస్తున్నారు. గాంధీ విగ్రహాన్ని దేవునితో సమానంగా పూజిస్తూ గౌరవిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం ఉన్నా గాంధీకి పూజలు చేసిన తరవాతే తమ పండగలు ప్రారంభిస్తామని చెబుతున్నారు.

గాంధీజీని దేవుళ్లతో సమానంగా ఆయనకు నిత్య పూజలు చేస్తూ కొలవడం తమ సాంప్రదాయంగా మారిందని అంటున్నారు. వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే నర్సింగ పూర్ గ్రామస్ధులు మాత్రం వర్షాలు కురవాలని గాంధీకి జలాభిషేకం చేస్తారు. తరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని గ్రామస్ధులు చెబుతున్నారు. గాంధీ అంటే జాతి పిత కాదు తమ దేవుడు అని అంటున్నారు.

గాంధీజీ జయంతి, వర్ధంతి రోజున గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేస్తారు గ్రామంలో తొలి పూజ మలి పూజ గాంధీజీకి చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్ధులు చెబుతారు. గాంధీజీని దేవునిలా కొలుస్తుండటం వల్ల తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆ గ్రామస్ధుల విశ్వాసం. ఇక ఇదంతా ఎవరి మొప్పో పొందడానికి కాదని స్వాతంత్రం తెచ్చి పెచ్చిన జాతిపితకు నిజమైన గౌరవం ఇచ్చేందుకు ఇలా నిత్య పూజలు చేస్తామని అంటున్నారు. మొత్తానికి గాంధీని గాడ్ గా మార్చి నిత్య పూజలు చేస్తున్న నర్సింగ పూర్ వాసులు స్పూర్తిగా నిలుస్తున్నారు.



లైవ్ టీవి


Share it
Top