ఉర్జిత్ పటేల్‌పై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు- మోడీ

ఉర్జిత్ పటేల్‌పై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు- మోడీ
x
Highlights

కొత్త ఏడాదిలో ప్రధాని మోడీ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక కీలక విషయాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు.

కొత్త ఏడాదిలో ప్రధాని మోడీ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక కీలక విషయాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రయిక్ విషయంలో తామెంతో రిస్క్ తీసుకున్నామని మోడీ వెల్లడించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ కమాండోస్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఉగ్రవాదుల అడ్డాలపై ఎంతో సాహసంతో దాడి చేశారని గుర్తుచేశారు. భారత బలగాల భద్రత దృష్ట్యా దాడి చేయాల్సిన తేదీలను రెండు మూడు సార్లు మార్చాల్సి వచ్చిందని మోడీ తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విషయంలో కూడా మోడీ తొలిసారిగా స్పందించారు. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా ఎంతో నైపుణ్యంతో తన బాధ్యతలు నిర్వర్తించారని మోడీ తెలిపారు. ఉర్జిత్ పటేల్‌పై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయడానికి 6, 7 నెలల ముందు నుంచి పదవి నుంచి తప్పుకుంటానని ఉర్జిత్ పటేల్ లిఖిత పూర్వకంగా తనను కోరిన విషయాన్ని మోడీ వెల్లడించారు.పెద్ద నోట్ల రద్దు అంశంపై కూడా మోడీ స్పందించారు. ప్రజలకు ఈ విషయమై చాలా కాలం ముందే వెల్లడించాని మోడీ తెలిపారు. పెనాల్టీలు చెల్లించి.. నల్ల ధనాన్నిబహిర్గతం చేయాలని ప్రజలకు ఎన్నో సార్లు విన్నవించామని మోడీ గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories