Top
logo

బీజేపీతో పొత్తు పెట్టుకోం

బీజేపీతో పొత్తు పెట్టుకోం
X
Highlights

రానున్నసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. కాగా బీజేపీ పార్టీతో పొత్తుపై స్పందించారు డీఎంకే అధినేత స్టాలిన్.

రానున్నసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. కాగా బీజేపీ పార్టీతో పొత్తుపై స్పందించారు డీఎంకే అధినేత స్టాలిన్. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీతో అసలు పొత్తు పెట్టుకునే ప్రసక్తలేదని స్టాలిన్ స్పష్టం చేశారు. అసలు భారత ప్రధాని నరేంద్ర మోడీ తనను అటల్ బీహారి వాజపేయితో పోల్చుకోవడం సరికాదన్నారు స్టాలిన్. ప్రధాని రాష్ట్రాలను కాలరాసున్నాడని మోడీపై స్టాలిన్ నిప్పులు చెరిగారు. అసలు మోడీ తమిళనాడుకు చేసింది ఏమీ లేదని అంతా తానే చేస్తున్నారనే భ్రమలో ఉన్నారని స్టాలిన్ అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో పొత్తు చాలా ప్రమాదకరమైనది అని స్టాలిన్ పెర్కోన్నారు. నరేంద్ర మోడీలా వాజపేయి ఎప్పుడు ఒంటరి నిర్ణయాలు తీసుకోలేదని, నిర్ణయాత్మక రాజకీయ నిర్ణయాలు తీసుకున్న వాజపేయికి గతంలో తాము పూర్తి మద్దతు ఇచ్చామని స్టాలిన్ గుర్తుచేశారు.

Next Story