100 రోజులు 20 రాష్ట్రాలు

narendra modi
x
narendra modi
Highlights

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అయ్యింది. జనవరి 3 నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. వచ్చే 100 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20 రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అయ్యింది. జనవరి 3 నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. వచ్చే 100 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20 రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహారచన చేస్తోంది. తక్కువ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. స్థానిక పార్టీలతో కూటములకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో ఒడిశా, అసోంలలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. జనవరి 4న మోడీ మరోసారి అసోంలో పర్యటించనున్నారు. జనవరి 5న ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలా మార్చి వరకు 20 రాష్ట్రాల్లో మోడీ ప్రచారం చేపట్టనున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి ఓటమిపాలైన 123 నియోజకవర్గాలపైఈసారి ప్రత్యేక దృష్టిపెట్టింది. మిషన్‌ 123 పేరుతో ఈ 123 నియోజకవర్గాలను 25 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్ బాధ్యతలను ఒక్కో నాయకుడికి అప్పజెప్పింది. ఇక తొలిసారి ఓటర్లను ఆకర్షించేందుకు 'షన్‌ విత్‌ నమో నెట్‌వర్క్‌ను జనవరి 12న ప్రారంభించనుంది. ఆయా ప్రాంతాల్లో అత్యంత ప్రభావవంతమైన యువకులను గుర్తించి వారి ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనుంది.

మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బూత్‌ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీ వేదికగా పార్టీ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. దాదాపు 15వేల మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లా స్థాయి కార్యకర్తలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories