కౌన్ బ‌నేగా ఎంపీ ? నరసాపురంలో గెలుపు ఎవ‌రిది ?

కౌన్ బ‌నేగా ఎంపీ ? నరసాపురంలో గెలుపు ఎవ‌రిది ?
x
Highlights

ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆ నియోజకవర్గం వైపే. అందరి ఆకర్షిస్తోన్న నియోజకవర్గాల్లో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుండి ఎన్నికల బరిలో...

ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆ నియోజకవర్గం వైపే. అందరి ఆకర్షిస్తోన్న నియోజకవర్గాల్లో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతున్నది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైనా నాగబాబు పోటీ చేస్తుండటమే దీనికి కారణం. కాగా ఈ నియోజకవర్గం నుండే మరో ఇద్దరు బరిలో ఉన్నారు. అధికార పార్టీ టీడీపీ నుండి వేటుకూరి శివరామరాజు, వైసీపీ రఘురామ కృష్ణం రాజు పోటీలో ఉన్నారు. ఇక దీంతో నరసాపురంలో త్రిముఖపోరు ఖాయంగా కనిపిస్తోంది. కాగా నాగబాబుతో చూస్తే ఆ ఇద్దరి బల బలహీనలు గట్టిగానే ఉన్నాయి. నాగబాబుతో పోలిస్తే వీరిద్దరూ ఆర్థికంగా బలవంతులు కూడా. ఇక్కడి నుంచి విజయం సాధించడం జనసేన అభ్యర్ధి నాగబాబుకు నల్లేరు మీద నడకేం కాదు. జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా నరసపురంలో జనసేన జెండా ఎగరవేయవచ్చని నాగబాబు భావిస్తున్నారు. ఈ లోక్‌సభాస్థానానికి 1957 నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ, 2సార్లు బీజేపీ, ఒకసారి సీపీఐ అభ్యర్థులు గెలిచారు.

ఇక టీడీపీ నుండి వేటుకూరి శివరామరాజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పథకాలతోనైనా నెట్టుకరావొచ్చని వేటుకూరి భావిస్తున్నారు. అయితే వేటూరి నారా చంద్రబాబు పాలన గురించి వివరిస్తూ గడప గడప ప్రచారంలో దూసుకెళ్లున్నారు. అయితే వేటుకూరికి పోటీగా వైసీపీ రఘురామ కృష్ణం రాజు కూడా గట్టి పోటీని ఇచ్చే యోచనలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇసారి ఎలాగైనా అధికార పార్టీని ఓడించి ఏపీలో వైసీపీ జెండా ఎగరవేయలని వైసీపీ భావిస్తోంది. కాగా త్రిముఖపోరు విజయం ఎవరిని వరిస్తోందో చూడాలి. హోరాహోరి పోరులో విజయకేతనం ఎగరవేసేది ఎవరో..? ఈ త్రిముఖ పోరులో నరసపురంలో నెగ్గెది ఎవరో..? తగ్గెది ఎవరో..? నరసాపురం ప్రజలు ఎవరికి పట్టం కడుతారో వేచిచూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories