Top
logo

చంద్రబాబును డిస్టింక్షన్‌లో పాస్ చేయించాలి..:భువనేశ్వరి

చంద్రబాబును డిస్టింక్షన్‌లో పాస్ చేయించాలి..:భువనేశ్వరి
X
Highlights

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. హోరాహోరాగా నువ్వానేనా అన్నంత రేంజ్ ప్రచారంలో దూసుకెళ్తున్నరు నాయకులు....

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. హోరాహోరాగా నువ్వానేనా అన్నంత రేంజ్ ప్రచారంలో దూసుకెళ్తున్నరు నాయకులు. కాగా ఎన్నికల కధనరంగంలోకి పార్టీ అధినేతల కుటుంబసభ్యులు కూడా పాల్గొని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తరుపున వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరుపున బాబు సతీమణి భువనేశ్వరి టీడీపీ వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొన్న ధాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో భువనేశ్వరి కూడా ప్రత్యేక్షంగా కాకపోయినా పరోక్షంగా పాల్గొంటున్నారు.

తన భర్త చంద్రబాబును ఈ ఎన్నికల్లో గెలిపించేలా కృషి చేయాలని భువనేశ్వరి కుప్పం టీడీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో దాదాపు 2వేల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి 75శాతం ఓట్లతో డిస్టింక్షన్‌లో నారా చంద్రబాబును పాస్‌ చేయించాలని కార్యకర్తలకు భువనేశ్వరి సూచించారు. మొత్తానికి అటు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ప్రచారంలో దూసుకపొతున్న నేపథ్యంలో ఇటు భువనేశ్వరి సైతం టెలికాన్ఫిరెన్స్ ద్వారా కార్యకర్తలకు సూచనలు చేశారు.

Next Story