logo

ఏపీ ఎన్నికల్లో నానీల సమరం...ఎందరు నానీలు...

ఏపీ ఎన్నికల్లో నానీల సమరం...ఎందరు నానీలు...
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూడు ప్రధానపార్టీల తరపున వందలమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా నానీ ముద్దుపేరుగా కలిగిన...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూడు ప్రధానపార్టీల తరపున వందలమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా నానీ ముద్దుపేరుగా కలిగిన ఆరుగురు అభ్యర్థులు మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల తరపున సందడి సందడి చేస్తున్నారు. అసలు పేరు ఒకటైతే నానీ ముద్దుపేరే అసలు పేరుగా ఓటర్లలోకి దూసుకుపోతున్నారు.

నానీ ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది కుటుంబాలలోని పిల్లలు, పెద్దల్లో చాలమందికి ఈ ముద్దుపేరు ఉండితీరుతుంది. అంతేకాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఆరుగురు నానీలు వివిధ నియోజకవర్గాల నుంచి విజయానికి ఉరకలేస్తున్నారు. అసలు పేర్లు వేరైనా నానీ ముద్దు పేరుతోనే తమ నియోజకవర్గాలలో సుపరిచితులైన ఈ నానీలు ఇటు టీడీపీ అటు వైసీపీల నుంచి పోటీకి దిగారు. వీరిలో కృష్ణాజిల్లా నుంచి ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇద్దరు నానీలు ఉంటే చిత్తూరు జిల్లా నుంచి సింగిల్ నానీ మాత్రమే బరిలో నిలిచారు.

విజయవాడ లోక్ సభ స్థానంలో టీడీపీ సిటింగ్ ఎంపీ కేశినేని నానీ వరుసగా రెండోసారి తన అదృష్టం పరీక్షించుకొంటున్నారు. కేశినేని నానీగా సుపరిచితమైన ఈయన అసలు పేరు కేశినేని శ్రీనివాస్. మరవైపు విజయవాడ చెంతనే ఉన్న గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న కొడాలి నానీ సైతం శాసనసభ్యుడిగా, సినీ నిర్మాతగా నానీ పేరుతోనే గుర్తింపు తెచ్చుకొన్నారు. కొడాలి నాని అసలు పేరు శ్రీవెంకటేశ్వరరావు అని చాలామందికి తెలియకపోవడం విశేషం.

గుడివాడకు కూతవేటు దూరంలో ఉన్న మచిలీపట్నం శాసనసభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సమరానికి సిద్ధం అంటున్న అభ్యర్థి పేరు సైతం నానీనే. పేర్ని నానీగా గుర్తింపు సంపాదించుకొన్న ఆయన పేరు పేర్ని వెంకట్రామయ్య. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టీడీపీ అభ్యర్థి ఈలి నాని అసలు పేరు వెంకట మధుసూదనరావు. అయితే ఆయన రాజకీయవర్గాలలో ఈలి నానీ పేరుతోనే గుర్తింపు తెచ్చుకొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆళ్ల నానీ అసలు పేరు కాళీ కృష్ణ. అయితే ఆళ్ల నానీగానే ఆయన అందరి దృష్టి ఆకర్షించగలిగారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులపర్తి నాని సైతం ఎన్నికల బరిలో నిలిచారు. పులపర్తి నానీ అసలు పేరు వెంకట మణిప్రసాద్. మరి ఈ ఆరుగులు నానీల్లో ఎందరు శాసనసభ, లోక్ సభలో అడుగుపెడతారన్నదే ఇక్కడి అసలు పాయింట్.


లైవ్ టీవి

Share it
Top