logo

సీఎం ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం: సుహాసిని

Nandamuri SuhasiniNandamuri Suhasini
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమని తెలంగాణ టీడీపీ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమని తెలంగాణ టీడీపీ నేత, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని చెప్పారు. సంక్రాంతి వేడుకల కోసం గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయానికి తమ కుటుంబం శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగిన సుహాసిని ఓటమి పాలయ్యారు.


లైవ్ టీవి


Share it
Top