స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటాం : ఈటల

స్టాల్స్‌ నిర్వాహకులను ఆదుకుంటాం : ఈటల
x
Highlights

నుమాయిష్ అగ్ని ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేసి నిజం నిగ్గుదేలుస్తామన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్. నిపుణుల కమిటీ రిపోర్టు...

నుమాయిష్ అగ్ని ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేసి నిజం నిగ్గుదేలుస్తామన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్. నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 79ఏళ్ల నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదన్నారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులతో పాటు సొసైటీ తీవ్రంగా బాధపడుతుందని తెలిపారు. నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం దృష్ట్యా నేడు, రేపు ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నామని చెప్పారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రయివేటు సంస్థ కాదు.. వ్యాపార సంస్థ కాదు.. పేద ప్రజల కోసం పని చేస్తోందన్నారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 4 అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నామని ఈటల రాజేందర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories