Top
logo

అసెంబ్లీలో హైలైట్‌గా నిలిచిన బాల్క సుమన్ లవ్ స్టోరీ

అసెంబ్లీలో హైలైట్‌గా నిలిచిన బాల్క సుమన్ లవ్ స్టోరీ
X
Highlights

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లవ్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీలో హైలైట్‌గా నిలిచింది. అసెంబ్లీలో చెప్పొచ్చో...

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ లవ్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీలో హైలైట్‌గా నిలిచింది. అసెంబ్లీలో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదంటూనే బాల్క సుమన్ తన ప్రేమ కథను చెప్పుకొచ్చారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న పద్మారావు గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడిన బాల్క సుమన్‌ తన ప్రేమకథను సహచర సభ్యులతో పంచుకుని అసెంబ్లీలో నవ్వులు పూయించాడు.

ఆరోపణలు ప్రత్యారోపణలు, మాటల తూటాలతో హాట్‌ హాట్‌గా సాగే తెలంగాణ అసెంబ్లీలో ప్రేమ కథ వినిపించింది. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న పద్మారావు గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ లవ్‌ స్టోరీని సహచర సభ్యులతో పంచుకున్నారు. పద్మారావు అన్న వల్లే తన ప్రేమ వివాహం జరిగిందని అన్నీ తానై తన పెళ్లి జరిపించారని గుర్తుచేసుకున్నారు. సుమ‌న్ త‌ప్ప‌నిస‌రిగా ఎమ్మెల్యే అవుతాడని మంచి పొజిష‌న్ లో ఉంటాడ‌ని మంచి పిల్ల‌గాడంటూ త‌న అత్త‌మామ‌ల్ని ఒప్పించి పెళ్లి చేయించార‌న్నారు.

సుమన్ చెప్పిన లవ్ స్టోరీతో సభలో నవ్వులు విరబూసాయి. డిప్యూటీ స్పీకర్ సహా సభ్యులంతా నవ్వుకున్నారు. సుమన్ ప్రసంగిస్తున్నంత సేపు పద్మారావు గౌడ్ నవ్వుతూనే ఉన్నారు. పద్మారావు అన్న నోరు చాలా మంచిదన్న బాల్క సుమన్‌ ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. అసెంబ్లీలో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదంటూనే బాల్క సుమన్ తన ప్రేమ కథను చెప్పడంతో సభలో నవ్వులు విరబూసాయి. అలా బాల్క సుమన్ లవ్‌ స్టోరీ అసెంబ్లీలో హైలైట్‌గా నిలిచింది.

Next Story