లిఫ్ట్ అడిగాడు .. ఉహించని గిఫ్ట్ పట్టాడు ..

లిఫ్ట్ అడిగాడు .. ఉహించని గిఫ్ట్ పట్టాడు ..
x
Highlights

అ కుర్రాడు పేరు ప్రభుతేజ్ .. అతడు చదువుకోవాలంటే స్కూల్ కి రోజు మూడు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్ళాలి .. ఇలా రోజు ఎవరో ఒకరిని లిఫ్ట్ ఆడుకుంటూ వెళ్తాడు...

అ కుర్రాడు పేరు ప్రభుతేజ్ .. అతడు చదువుకోవాలంటే స్కూల్ కి రోజు మూడు కిలోమీటర్ల నడుచుకుంటూ వెళ్ళాలి .. ఇలా రోజు ఎవరో ఒకరిని లిఫ్ట్ ఆడుకుంటూ వెళ్తాడు .. ఇదే క్రమంలో ఒకరోజు కారులో వెళ్తున్న వ్యక్తిని కారు ఆపి ఎక్కాడు .. ఇదే నేను మొదటి సారి కారెక్కడం అని తన అనుభూతిని పంచుకున్నాడు .. అ కారులో ఉన్నది మాత్రం జవహర్‌నగర్‌ మున్సిపల్‌ ఇన్‌ఛార్జి కమిషనర్‌ రఘు అని మాత్రం అని తెలియదు ..

కమిషనర్ రఘు అ కుర్రాడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు .. తన పేరు ప్రభుతేజ అని.. బాలాజీనగర్‌ గవర్నమెంట్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నట్టు తెలిపాడు. తన తండ్రి చంద్రయ్యకు కంటి చూపులేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటారని, తల్లి లలిత కిడ్నీ సమస్యతో బాధపడుతూనే ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని చెప్పాడు. తనకు ఓ తమ్ముడు సైతం ఉన్నాడని ప్రభుతేజ వివరించాడు.

ప్రభుతేజ్ కుటుంబ పరిస్థితి విని చలించిపోయిన కమిషనర్ అతడి కుటుంబానికి సాయంచేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుతేజ్ చదువుతోన్న పాఠశాలకు వెళ్లి కొత్త సైకిల్‌ను విద్యార్థికి అందజేశారు. ఊహించని ఈ బహుమతికి బాలుడు సంతోషానికి గురయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories