టాయ్‌లెట్ నీటితో ఇడ్లీల తయారీ...వీడియో వైరల్

టాయ్‌లెట్ నీటితో ఇడ్లీల తయారీ...వీడియో వైరల్
x
Highlights

వీధుల్లో ఇడ్లీ అమ్మే ఓ వ్యాపారి చట్నీ తయారీకి మరుగుదొడ్డిలోని నీటిని వాడాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....

వీధుల్లో ఇడ్లీ అమ్మే ఓ వ్యాపారి చట్నీ తయారీకి మరుగుదొడ్డిలోని నీటిని వాడాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వేస్టేషను వద్ద టిఫిన్ సెంటరు నడుపుతున్న ఓ వ్యాపారి ఇడ్లీతో పాటు చట్నీ తయారు చేసేందుకు రైల్వేస్టేషనులోని మరుగుదొడ్డి నీటిని వినియోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి శైలేష్ స్పందించి దీనిపై విచారణ జరిపారు. ప్రజలంతా కలుషిత నీటితో తయారు చేసే ఆహారపదార్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 'ఆ వీడియో మా దృష్టికి రావడం జరిగింది. ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. కలుషిత నీటిని ఉపయోగించే అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ నీరు ఆరోగ్యానికి మంచివి కావు. సదరు వ్యక్తిని పట్టుకుని అతని లైసెన్స్‌ను తనిఖీ చేస్తాం, ఎలాంటి సాంపిల్‌ దొరికినా సీజ్‌ చేస్తాం'అని ముంబై ఎఫ్‌డీఏ అధికారి శైలేష్‌ అదావ్‌ మీడియాకు తెలిపారు


Show Full Article
Print Article
Next Story
More Stories