ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రధాని కావొచ్చు: కవిత

ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రధాని కావొచ్చు: కవిత
x
Highlights

టీఆర్ఎస్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వడివడి అడుగులు వేస్తున్నారు. అయితే దీనిపై ఎంపీ కవిత మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాత్రం కెసిఆర్ భారత ప్రధానిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని కవిత వ్యాఖ్యనించారు.

టీఆర్ఎస్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వడివడి అడుగులు వేస్తున్నారు. అయితే దీనిపై ఎంపీ కవిత మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాత్రం కేసీఆర్ భారత ప్రధానిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని కవిత వ్యాఖ్యనించారు. ఓ టీవీ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ కవిత ఈ మేరకు స్పందించారు. అయితే ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ మోజారిటీ సీట్లతో అధికారంలోకి వస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని అవుతారా? అని యాంకర్ ప్రశ్నించగా దినికి కవిత స్పందిస్తూ అప్పటి పరిస్థితిని బట్టి ఎవరు భారత ప్రధానిగా ఉండాలో నిర్ణయించుకుంటాం అని అన్నారు. కాగా ఆ సందర్భాన్ని బట్టి కేసీఆర్ ప్రధాని మంత్రి కావొచ్చని కవిత అన్నారు. ఇక మరో వైపు తన సోదరుడు కేటీఆర్ తెలంగాణ సీఎం ఎప్పుడు అవుతారన్న ప్రశ్నకు ఎంపీ కవిత స్పందిస్తూ దానికి ఇంకా సమయం ఉందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories