పలు సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు ఎంపీ కవిత రాజీనామా

పలు సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు ఎంపీ కవిత రాజీనామా
x
Highlights

పలు సంఘాల అధ్యక్ష పదవులకు ఎంపీ కవిత రాజీనామా చేశారు. రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘం, విద్యుత్ కార్మిక సంఘం, అంగన్‌వాడీ టీచర్స్ , హెల్పర్స్...

పలు సంఘాల అధ్యక్ష పదవులకు ఎంపీ కవిత రాజీనామా చేశారు. రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘం, విద్యుత్ కార్మిక సంఘం, అంగన్‌వాడీ టీచర్స్ , హెల్పర్స్ అసోసియేషన్, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల గౌరవ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులకు తన రాజీనామా లేఖలను అందజేశారు. కార్మికుల సేవలో సంతృప్తి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పనిభారం దృష్ట్యా తన సేవలను అందించలేక పోతున్నానని కవిత అన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గానికి మరింత సమయం కేటాయించవల్సి ఉన్నందున సంఘాల గౌరవ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తూ కార్మికలోక సంక్షేమానికి అందుబాటులో ఉంటానని కవిత తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories