టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య.. ఇంటర్‌లో..

టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య.. ఇంటర్‌లో..
x
Highlights

తెలంగాలో ఇంటర్ ఫలితాలు గందరగోళంలో పడేసాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని...

తెలంగాలో ఇంటర్ ఫలితాలు గందరగోళంలో పడేసాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేఫథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో నెలకొంది. హైదరాబాద్‌లో సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మరామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనగర్‌లో ఓ ఏడంతస్తుల భవనం పై నుండి దూకి మృతిచెందాడు. హుటాహుటినా సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలికిచేరి పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను ఆరాతీయగా మొన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ఫెయిలవడంతోనే ధర్మరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. నిన్న శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ధర్మరామ్ ఉండే ఏడంతుస్తల భవనం పై నుంచి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో రక్తస్తావం కావడంతో వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు . ధర్మరామ్ ఒకే ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

ఇంటర్ ఫలితాలు వెలువడిన నుండి విద్యార్థులు వరస ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇకమరోవైపు ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్లే విద్యార్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్దకం చేసారంటూ ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రమేశ్ అల్లుడు సైతం సూసైడ్ చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories